సీఎం కేసీఆర్ ఇవి గనుక చేస్తే తిరుగు ఉండదు...?

If CM KCR does these there will be no turning back

తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో ఆయన అప్రమత్తంగానే ఉంటున్నారు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా కొంతవరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ లో బలంగానే ఉంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం భారతీయ జనతా పార్టీని అడ్డుకునే విషయంలో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని టిఆర్ఎస్ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళుతున్నారు. పెట్రోల్ గ్యాస్ ధరల పెంపు విషయంలో ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ చాలా నయం అనే విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలన ఉంది అనే భావన తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ కేంద్రంలో అధికారంలో ఉంటే బాగుంటుంది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తే సీఎం కేసీఆర్ కు దెబ్బ తగులుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వైపు తెలంగాణ ప్రజలు చూడ కుండా ఉండాలి అంటే ప్రజలకు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో అలాగే ధరల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కొన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టి తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎలాగు అవకాశాలు లేవు.

కాబట్టి అక్కడ కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లే విధంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. కచ్చితంగా నిరుద్యోగ భృతి అందించడంతో పాటు ఉద్యోగ నియామకాలు కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టాల్సి ఉంది. అయితే ఈ విషయంలో సీఎం కేసీఆర్ విఫలమవుతున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ను దూకుడుగా వెళ్తే మాత్రం బీజేపీని  అడ్డుకోవడం సీఎం కేసీఆర్ కు పెద్ద కష్టం కాదు.

అయితే వాస్తవ పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోలేక పోతుంది అనే అభిప్రాయం కూడా కొంత మందిలో ఉంది. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సరే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు కాలేదు ఇప్పుడు అదే ప్రధాన సమస్యగా మారింది. ఇళ్ళ నిర్మాణాల విషయంలో నిరుద్యోగ సమస్య విషయంలో  తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెడితే మాత్రం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి.

 


                    Advertise with us !!!