గుజరాత్‍కేనా? హైదరాబాద్‍కు ఆ అర్హత లేదా?

minister-ktr-speech-at-the-cii-annual-meeting

బుల్లెట్‍ రైలు గుజరాత్‍కేనా? హైదరాబాద్‍కు అర్హత లేదా? అని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‍ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం, దేశం కోసం పనిచేయాలని హితవు పలికారు. హైదరాబాద్‍ బేగంపేటలోని ఐటీసీ కాకతీయలో సీఐఐ వార్షిక సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‍ మాట్లాడుతూ వరంగల్‍ రైల్వే కోచ్‍ ఫ్యాక్టరీ కోసం 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్‍ ఫ్యాక్టరీ రాలేదన్నారు. మేకిన్‍ ఇండియా అంటున్న కేంద్రం రాష్ట్రానికి ఒక్క ఇండిస్ట్రియల్‍ జోన్‍ కూడా కేటాయించలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలు అమలు చేయడం లేదని, ఐటీఐఆర్‍ కారిడార్‍ను రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రం నుంచి అధిక ఆదాయం పొందుతున్న కేంద్రం తగిన కేటాయింపులు చేయకుండా అన్యాయం చేస్తోందని విమర్శించారు. కేంద్ర హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎవర్ని అడగాలని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుమతి సుంకాలు పెంచి, మేకిన్‍ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా అని ప్రశ్నించారు.

ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందని అన్నారు. ఐటీ, లైఫ్‍ సైన్సెస్‍, ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఐటీ దిగుమతులు రూ.1.40 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. అంకురాలతో తెలంగాణ ఇన్నోవేషన్‍ హబ్‍గా మారుతోందన్నారు. స్పెషల్‍ ఫుడ్‍ ప్రాసెసింగ్‍ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిఫెన్స్, ఏరో స్పేస్‍ రంగానికి హైదరాబాద్‍ నిలయంగా ఉందని అన్నారు.


                    Advertise with us !!!