వైట్‍హౌస్‍ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్‍గా భారతీయ అమెరికన్

Indian American Maju Varghese appointed deputy assistant to Joe Biden

జో బైడెన్‍ ప్రచార కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన భారతీయ సంతతికి చెందిన మజా వర్గీస్‍ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‍కి డిప్యూటీ అసిస్టెంట్‍గా, వైట్‍హౌస్‍ మిలటరీ ఆఫీస్‍ డైరెక్టర్‍గా నియమిస్తున్నట్టు వైట్‍హౌస్‍ ప్రకటించింది. న్యాయవాది అయిన వర్గీస్‍, బైడెన్‍ ప్రచార కార్యక్రమంలో చీఫ్‍ ఆపరేటింగ్‍ ఆఫీసర్‍గా సేవలందించారు. దేశానికీ, అధ్యక్షుడికీ సేవచేయడం తనకు గౌరవం అంటూ, తన బృందం సభ్యులతో కలిసి చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని, కలిసి సృష్టించిన చరిత్రను,  నేడు అప్పగించిన బాధ్యతలను గురించి వర్గీస్‍ ట్వీట్‍ చేశారు. అధ్యక్షుడి ప్రయాణ సంబంధింత విషయాలూ, వైద్య వ్యవహారాలూ, అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రి సౌకర్యాలు తదితర విషయాలను వైట్‍హౌస్‍ మిలటరీ ఆఫీస్‍ నిర్వహిస్తుంది. అధ్యక్షుడి ఇనాగురల్‍ కమిటీలోని నలుగురు సభ్యుల్లో వర్గీస్‍ ఒకరు.

 


                    Advertise with us !!!