‘బిగ్ బాస్’ తెలుగు 4 సీజన్ ఫేమ్ సోహెల్ హీరోగా ‘జార్జి రెడ్డి’ ప్రొడక్షన్ లో చిత్రం

Bigg Boss 4 Sohel New Movie Opening

బిగ్ బాస్ తెలుగు 4 సీజన్  ఫేమ్ సోహెల్ సినిమా షురూ చేశాడు. ఆయన హీరోగా తొలి చిత్రం ప్రారంభమైంది. ‘జార్జి రెడ్డి’ లాంటి మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ మైక్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా పాపులర్ అయిన సయ్యద్ సోహెల్ రియాన్ అలియాస్ సోహెల్ ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతున్నారు. సోహెల్ హీరోగా తొలి చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలియజేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు సోహెల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టర్‌ను పోస్ట్ చేసిన సోహెల్.. ‘‘సోహో‘లయన్స్’ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్షణం వచ్చింది. ఈరోజే షూటింగ్ మొదలైంది. మీ ప్రేమ, ప్రోత్సాహాన్ని ఇలానే అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు నాపై ఉంటాయని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు.

‘జార్జి రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాలతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న నిర్మాత అప్పిరెడ్డి తన మైక్ మూవీస్ బ్యానర్‌పై మూడో చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మైక్ మూవీస్ నుండి ‘జార్జి రెడ్డి’, ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాలు తీశాం. అవి ఎంత పెద్ద విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడో సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటితో కలసి బిగ్ బాస్ ఫేం సోహెల్ హీరోగా చేస్తున్నాం. ఇప్పటి వరకు భారతదేశ చలనచిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని అన్నారు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ డైరెక్టర్. అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, అభిషేక్ రెడ్డి నిర్మాతలు. రచన, దర్శకత్వం శ్రీనివాస్ వింజనంపాటి.


                    Advertise with us !!!