నాగశౌర్యతో బాలయ్య ఒప్పుకుంటాడా?

Nandamuri Balakrishna Not Given a nod to Naga Shaurya

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఖాతాలో ఛలో సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే దక్కలేదు. ఛలో తర్వాత వచ్చిన తన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. తను స్వయంగా స్టోరీ అందించి, చేసిన అశ్వథ్థామ కూడా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు.

దీంతో అశ్వథ్థామ తర్వాత గ్యాప్ తీసుకుని ఆలోచించి మరీ కథలు ఓకే చేస్తున్నాడు శౌర్య. లక్ష్య అనే యాక్షన్ థ్రిల్లర్ లో సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన తో పాటూ నాగశౌర్య మేకోవర్ కు కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

ఇప్పటికే శౌర్య చాలా సినిమాలకు సైన్ చేశాడు. వీటన్నింటినీ పూర్తి చేసి ఒక్కొక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇవి కాకుండా ఒక కొత్త డైరక్టర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఈ సినిమాలో శౌర్యతో పాటూ మరో అగ్రనటుడు కూడా నటించనున్నాడట. మల్టీస్టారర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఆ పాత్ర కోసం బాలయ్యను కలిశాడట నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. బాలయ్య మాత్రం స్ర్కిప్ట్ నచ్చినా కూడా  ఓకే చెప్పలేదట. దీంతో సినిమాను త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్న ఉద్ధేశ్యంతో నాగ్ ను సంప్రదించగా తను ఆల్రెడీ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో మళ్లీ బాలయ్యతో చర్చలు జరుపుతున్నారట. మరి శౌర్య తో మల్టీస్టారర్ కు బాలయ్ ఒప్పుకుంటాడో లేదో అనే ఆయన రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు హీరో, నిర్మాతలు.