కాంగ్రెస్ కు ఇన్ని సమస్యలా... ఇలా అయితే బ్రతుకుతుందా...?

Analysis of Congress Party s intolerance towards its own Senior Leaders

దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనేది చాలా వరకు కష్టమే. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారం దిశగా అడుగులు వేయడం దాదాపుగా 16 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం వంటివి జరిగాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేతలకు కార్యకర్తలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి అనే ఆవేదన కూడా చాలామందిలో ఉంది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు చాలామంది రాహుల్ గాంధీ విషయంలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో పని చేయడానికి చాలా మంది నేతలు ముందుకు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఏమాత్రం కూడా బాగా లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో సమర్థవంతమైన నేతలు అధిష్టానం వద్దకు వెళ్లలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం ఉంది. అలాగే ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి అభిప్రాయమే ఉంది అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని తప్పులు ఎక్కువగా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక విషయంలో రెండేళ్ల నుంచి తప్పులు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. రాహుల్ గాంధీ ససేమిరా అంటూ దూరంగా ఉంటున్నారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలను సోనియాగాంధీ తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆమె తాత్కాలిక అధ్యక్షురాలు మాత్రమే ఉన్నా అనారోగ్య సమస్యలతో ఆమె పెద్దగా పార్టీ మీద దృష్టి పెట్టడం లేదు. టెన్ జన్ పత్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కూడా ఆమె పెద్దగా చేయడం లేదు. దీంతో రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై కాస్త ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం.

2019 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు పై ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే అవకాశాలు పెద్దగా కనబడలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంది. ప్రాంతీయ పార్టీలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ బలపడక పోతే మాత్రం చాలా రాష్ట్రాల్లో కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు. ఉదాహరణకు తెలంగాణ లో సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే నేత కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. రేవంత్ రెడ్డిలో ఆ లక్షణాలు కనబడిన సరే పెద్దగా ఆయనను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటం లేదు.

వర్గ విభేదాలతో పార్టీని కొంత మంది నాశనం చేస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కమల్ నాథ్ మీద వ్యతిరేకత ఉండటంతో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. రాజకీయాల నుంచి ఆయన పూర్తిగా తప్పుకున్నారు. ఇక రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కారణంగా సచిన్ పైలెట్ ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

గతంలో అధికారంలో ఉన్న సమయంలో బలంగా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా స్వేచ్ఛగా అడుగు లేకపోతుంది. వర్గ విభేదాలు కాంగ్రెస్ పార్టీ పరిష్కరించుకుని జాతీయ అధ్యక్షుడు ఎంపిక విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం... ప్రాంతీయ పార్టీల అధినేతల ఆలోచనలు కూడా అర్థం చేసుకునే రాజకీయం చేస్తే బాగుంటుంది.