దగ్గుబాటి అభిరామ్ లాంఛింగ్ డైరక్టర్ ఆయనేనా..?

Rana brother Abhimram Daggubati Film with Ravi Babu

దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటూ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్నాడు. ఇదే క్రమంలో సురేష్ బాబు చిన్న కొడుకు, రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా లాంఛ్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, లేట్ అవుతూ వస్తుంది. ప్రముఖ డైరక్టర్ వంశీ చేతుల మీదుగా అభిరామ్ తెలుగు తెరకు పరిచయం కానున్నాడని వార్తలొచ్చాయి కానీ తర్వాత పెళ్లి చూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ తో అభిరామ్ ని లాంఛ్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అభిరామ్ లాంఛింగ్ గురించి వార్తలొస్తున్నాయి.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట ప్రకారం.. అభిరామ్ ను రవిబాబు డైరక్ట్ చేయనున్నాడట. విభిన్న సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అభిరామ్ కోసం కూడా రవిబాబు ఒక వెరైటీ స్టోరీని రెడీ చేశారని, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.