నష్టాలను భర్తీ చేసే ఆలోచన జగన్, వాళ్ళ భారం దించుకుంటారా...?

CM YS Jagan dependence on some Party Leaders in AP

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాని కొన్ని కొన్ని సమస్యలు ముఖ్యమంత్రి జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కారణంగా ముఖ్యమంత్రి జగన్ ప్రశాంతంగా లేరు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఎందుకు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ కు మంత్రుల నుంచి సహకారం రావడం లేదు.

అలాగే స్థానిక నాయకత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా కష్ట పడిన పరిస్థితిలో కనబడలేదు. ఇక కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగిపోయింది అనే ఆవేదన కూడా వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక ముఖ్యమంత్రి జగన్ కొంతమంది నేతలకు బాధ్యతలను అప్పగించడం ఆ కొంతమంది మీదనే పార్టీ ఆధార పడటం వంటివి జరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో ఒక మంత్రిగారు మీదనే ఆధారపడుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అలాంటి పరిస్థితులు వున్నాయి.

గోదావరి జిల్లాలో కొంతమంది నేతల పెత్తనం ఎక్కువగా కనబడుతుంది. దీనివలన పార్టీకి కార్యకర్తలు దూరం అవుతున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సీరియస్ గానే ముందుకు వెళ్లవచ్చు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దీనివలన తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా విమర్శలు చేసే పరిస్థితి ఉంది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అడుగులు వేస్తున్నారు.

ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో మరో నేతకు బాధ్యతలు అప్పగించడం ద్వారా నియోజకవర్గ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలకి బాధ్యతలను కట్ చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు కొంతమంది అసెంబ్లీకి కూడా రావడం లేదు. కనీసం సచివాలయానికి వచ్చి తమ తమ నియోజక వర్గాల సమస్యలను కూడా అధికారుల వద్ద పెట్టలేకపోతున్నారు. కనీసం తనని కలిసే ప్రయత్నం కూడా కొంత మంది ఎమ్మెల్యేలు చేయడం లేదు.

దీనితో ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సమర్థవంతంగా పని చేయని మంత్రుల విషయంలో కూడా సీరియస్ గా ఉన్నారు. కొన్ని శాఖల నుంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నా ఆ శాఖల మంత్రులు కూడా ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే జగన్ ఇక లాభం లేదు అని చర్యలకు దిగే అవకాశాలు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.