ఉత్తరాంధ్ర అవకాశాలు సృష్టించినా బాబు నడవలేకపోతున్నారా...?

TDP party in Godavari districts

ఉత్తరాంధ్ర జిల్లాలో ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపిస్తుంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న చిన్న చిన్న తప్పులు మినహా పార్టీ నాయకత్వం అక్కడ సమర్థవంతంగా ఉంది. అయితే 2019 ఎన్నికల తర్వాత మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అనుకున్న విధంగా ప్రభావం చూపించలేకపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా కొంతమంది నాయకులు చుట్టూనే రాజకీయం నడుస్తుంది. దీనివలన కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే ఆవేదన తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్లమెంట్ అధ్యక్షుల మధ్య సమన్వయ లోపం ఎక్కువగా ఉంది. దీనితో చాలామంది కార్యకర్తలు కూడా నాయకులను కలిసే ప్రయత్నం చేయటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అనుకున్న దానికంటే కూడా మంచి ప్రభావం చూపించింది. కీలక నేతల నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మంచి ప్రభావం చూపించడం తో పార్టీ నాయకత్వం సంతోషంగానే ఉంది. కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని ముందుకు నడిపించే నాయకత్వం విషయంలోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సతమతమవుతున్నారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడుని ఎంపిక చేసిన తర్వాత కళా వెంకటరావు దాదాపుగా సైలెంట్ గానే ఉన్నారు అలాగే అశోక్ గజపతిరాజు కూడా పెద్దగా కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఆయన అప్పుడప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేయడం మినహా ఏమి చేసే ప్రయత్నం లేదు. ఇక దాదాపుగా ఆయన హైదరాబాదులోని ఎక్కువగా ఉంటున్నారనే భావన ఉంది. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు కూడా పెద్దగా ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం చేయడం లేదు. అలాగే విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా పెద్దగా ప్రజల్లో తిరగలేదు.

అధికార వైసీపీకి భయపడుతున్నారో లేకపోతే మరో కారణమో తెలియదుగానీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒరిస్సాలో కొంతమంది వ్యాపారాలు చేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నారు... కానీ పార్టీ మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఇక విశాఖ జిల్లా విషయానికొస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉంటారో వెళ్తారో అర్థం కాక కార్యకర్తలు కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఉంది. పార్టీ కోసం 2019 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం లో చాలా మంది కార్యకర్తలు కష్టపడి పని చేశారు. కానీ ఇప్పుడు వాళ్లని వాడుకునే గంటా శ్రీనివాసరావు మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గాన్ని గెలిపించి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక వెలగపూడి రామకృష్ణ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీని వలన పార్టీ సంస్థాగతంగా నష్టపోతుంది. మరి దీని మీద చంద్రబాబు నాయుడు దృష్టిపెడతారా లేదా అనేది చూడాలి. 


                    Advertise with us !!!