పది సెకన్ల వీడియో... రూ.48.4 కోట్లకు అమ్ముడుపోయింది

This 10 Second Video Clip Has Been Sold For a Whopping Rs 48 4 Crore

ఓ పది సెకన్ల వీడియో క్లిప్పింగ్‌ రూ.48.4 కోట్లకు అమ్ముడుపోయింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ అందులో అంత స్పెషలేముందంటారా? అదేంటో తెలియాలంటే ఇది చదవేయాల్సిందే.. అమెరికాకు చెందిన ఆర్ట్‌ కలెక్టర్‌ పబ్లో రోడ్రిగ్యూజ్‌ ఫ్రైల్‌ గతేడాది ఓ వీడియోను రూపొందించాడు. పది సెకన్ల నిడివి మాత్రమే ఉన్న దీనికోసం అతడు 67 వేల డాలర్లు ఖర్చు పెట్టాడు. భారత కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ.49.23 లక్షలు వెచ్చించాడు. అయితే అనూహ్యంగా గతవారం ఈ వీడియో 6.6 మిలియన్‌ డాలర్లకు అంటే 48.47 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ వీడియోలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేలపై చొక్క లేకుండా పడుకున్నట్లుగా ఉండగా అతడి శరీరంపై రకరకాల నినాదాలు రాసి ఉన్నాయి. జనాలు అతడిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతున్నారు.

10 సెకన్ల వీడియో క్లిప్పింగ్‌ అమ్మకాన్ని ధృవీకరిస్తూ రీయూటర్స్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో ఇదో కొత్త రకం నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ) అని పేర్కొంది. ఆన్‌లైన్లో ఇన్వెస్టర్లు ఎటువంటి భయాలు లేకుండా పెట్టుబడి పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని సృష్టం చేసింది. కాగా మోసాలకు కళ్లెం వేసేందుకు ఈ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని వాడుతారు. ఇది పారదర్శకతను అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఈ టెక్నాలజీలో సమాచారం అందరివద్దా ఉండటమే కాక ఎవరు ఏం చేయాలన్నా నిమిషాల్లో అందరికీ తెలిసిపోతుంది. దీంతో ఫ్రాడ్‌ జరిగే అవకాశమే లేదన్నమాట.

 

reut.rs/2Pn8STR

https://twitter.com/Reuters/status/1366609208125186048