పెండ్లి కొడుకు లేకుండానే.. పెళ్లి చేసుకుంది!

woman-marries-herself-after-breakup-in-us-in-an-act-of-self-love

మెగ్‍ టేలర్‍ (35) అనే అమెరికన్‍ మహిళ చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భర్త నుంచి విడిపోయిన ఆమె.. పెండ్లి కొడుకు లేకుండానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష ఖర్చుతో పెళ్లి వేడుక జరుపుకుంది. కేక్‍ తో పాటు కొత్త దుస్తులు, ఓ డైమండ్‍ రింగ్‍ను కూడా ఆమె కొనుగోలు చేసిది. ఇతరుల మెప్పు కోసం కాకుండా తన కోసమే ఇందంతా చేస్తున్నానని ఆమె చెప్పింది. తనను తానే పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. తన ఐడియాకు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా పెళ్లి చేసుకునేందుకు ఆమె ముందుకు వెళ్లింది. కొలరాడోలో జరిగిన ఈ వేడుకకు మెగ్‍ టేలర్‍ సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తన కోసం రాసుకున్న పెళ్లి ప్రమాణాలను చదువుతూ ఆమె తన వెడ్డింగ్‍ రింగ్‍ ను తానే ధరించి అద్దంలో తనను తానే ముద్దాడింది. మెగ్‍ టేలర్‍ వివాహం గురించిన ఈ వార్త సోషల్‍ మీడియాలో హాట్‍ టాపిక్‍గా మారింది.

 


                    Advertise with us !!!