సత్యం గురిజాపల్లి మృతిపై.. సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల

mahesh-bigala-mourns-satyam-gurijapalli-death

టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఆస్ట్రేలియా వైస్‌ ప్రెసిడెంట్‌ సత్యం గురిజాపల్లి మృతిపై టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల సంతాపం వ్యక్తం చేశారు. సత్యం మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సత్యంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మహేష్‌ బిగాల గుర్తు చేసుకున్నారు. సత్యం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కాగా, సత్యం గురిజాపల్లి వరంగల్‌లో 28 ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.