నెల రోజులు మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది..ఎక్కడో తెలుసా?

This Goa village is visible only for a month every year

గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరీవాహక ప్రాంతంలో కుర్ది అనే గ్రామం ఉంది. నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. కాకపోతే 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు. దాంతో ఆ గ్రామం మొత్తం నీట మునిగింది. ఇక్కడ విచిత్రమేంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు పాటు ఆ గ్రామం నీటిలోనే మునిగి ఉన్నా.. వేసవిలో మాత్రం తేలుతుంది. కారణం అక్కడ జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల ఆ సమయంలో గ్రామంలో ఆనవాళ్లు శిథిలాలు బయటకు కనబడుతాయి. అది కొద్ది రోజులు మాత్రమే. నీరు పూర్తిగా ఇంకిపోయినప్పుడు ఒక నెల రోజులు మాత్రమే ఆ గ్రామం కనబడుతుంది.

ఆనకట్ట కోసం తన గ్రామాన్ని ఇచ్చిన ఆ గ్రామంలోని ప్రజలు, ఇతర ప్రాంతాల్లో నివశించే వారు. ఈ నెలరోజులు పాటు ఇక్కడికి వచ్చి, సంబురాలు చేసుకుంటారు. వారు నివశించిన ప్రాంతాన్ని చూస్తూ అక్కడ సంతోషంగా గడుపుతుంటారు. శిథిలమైన తమ ఇండ్లను, తాము తిరిగిన ప్రాంతాలను గుర్తు చేసుకుంటుంటారు. అంతకు ముందు ఆ గ్రామంలో ఉన్న చర్చి, ఒక దేవాలయం ఉండగా అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా సరే.. ఆయా మతస్థులు వాటిట్లోనే తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. విందులు, వినోదాలు చేసుకుంటుంటారు. ఈ విషయం తెలిసి దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్ది గ్రామం ఒక దశలో ఓ దీవిలా దర్శనిమిస్తుంది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఆ ఆందమైన దృశ్యాన్ని చూడడం కోసం పర్యాటకులు, గ్రామస్థులు ప్రతి ఏటా అక్కడికి వెళ్లి ఎదురుచూడటం కుర్ధి ప్రత్యేకత.


                    Advertise with us !!!