తాము గెలవకపోయినా పర్వాలేదు... కానీ

MP Kishan Reddy Fire On CM KCR On MLC Elections

ప్రజలు కేసీఆర్‌ కుటుంబ పాలన పట్ల విసుగుచెందిన మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అధికా దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. తాము గెలవకపోయినా పర్వాలేదు..బీజేపీ మాత్రం గెలవొద్దనే విధంగా టీఆర్‌ఎస్‌ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే అని చెప్పారు. మేధావులు, పట్టభద్రులు ఆలోచించి హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాల్లోనూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

 


                    Advertise with us !!!