ప్రశాంత్ కిషోర్ (పీకే)కు కీలక బాధ్యతలు!

Punjab CM says Prashant Kishor has joined him as principal advisor

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ఆయన ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. ప్రశాంత్‌ కిషోర్‌ ప్రధాన సలహాదారుగా నాతో చేరారు. పంజాబ్‌ ప్రజల జీవితాలను మెరుగుపరిచేలా తామిద్దరం కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో వేచిచూస్తున్నామని అమరీందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ సారథ్యంలోని ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐప్యాక్‌) 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సర్కార్‌కు వ్యూహకర్తగా నిలిచి పార్టీ ఘన విజయానికి కీలక పాత్ర పోషించింది.

గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైసీపీకి సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్‌ కిషోర్‌ ఆ పార్టీ విజయం సాధించేలా వ్యూహాలు రూపొందించారు. ఇక పలు ఎన్నికల్లో తమతో ఒప్పందాలు చేసుకున్న పార్టీల విజయాల్లో ప్రశాంత్‌ బృందం కీలకంగా వ్యవహరించింది.


                    Advertise with us !!!