వైఎస్ షర్మిల పార్టీ.. ప్రకటన తేదీ ఖరారు!

Sharmila to launch party on April 9

వైఎస్‌ షర్మిల ఏప్రిల్‌ 9వ తేదీన పార్టీని ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీని ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల చర్చించారు. వైఎస్సార్‌టీపీ.. వైఎస్సార్‌ పీటీ..రాజన్న రాజ్యం అనే పేర్లను ఆమె పరిశీలించారు. మే 14 నుంచి లోటస్‌ పాండ్‌ వేదికగా పార్టీ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.