న్యాయవాద దంపతుల హత్య.. కీలక ఆధారాలు లభ్యం

weapons-recover-in-lawyer-couple-murder-case

తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యకేసులో నిందితులు ఉపయోగించిన కత్తిని పోలీసులు గుర్తించారు. పార్వతి బ్యారేజీలో 53, 54 నంబర్‌ పిల్లర్‌ వద్ద కత్తులను గజఈతగాళ్లు వెలికి తీశారు. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నిందితులను పార్వతి బ్యారేజీ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం నిన్న విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈరోజు మళ్లీ గాలింపు కొనసాగించారు. ఈసారి పెద్ద అయస్కాంతాల సాయంతో కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం 53-54 పిల్లర్ల వద్ద కత్తులు లభ్యమైంది. దీంతో కేసులో కత్తులు కీలకంగా మారడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించారు.  ఈ క్రమంలో రెండు కత్తుల కోసం అయిదుగురు గజ ఈతగాళ్లతో పాటు 50 మంది పోలీసులు గాలించారు.