ఆప్ లో చేరిన మిస్ ఇండియా

Miss India Delhi 2019 Mansi Sehgal joins AAP says Kejriwal inspires her

2019 మిస్‌ ఇండియా విజేత మాన్సి సెహగల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ నేత రాఘవ్‌ చద్దా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని నిజాయితీతో కూడిన పాలన పట్ల స్ఫూర్తి చెంది తాను పార్టీలో చేరినట్లు సెహగల్‌ తెలిపారు. ఢిల్లీకి చెందిన మాన్సీ 2019లో జరిగిన ఫెమీనా అందాల పోటీల్లో మిస్‌ ఇండియ ఢిల్లీగా కిరీటం దక్కించుకున్నారు. ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె.. నేతాజీ సుభాష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బి.టెక్‌ పూర్తి చేశారు.