21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత

Telangana s Medaram temple shut till March 21 after two employees test COVID positive

వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు రోజుపాటు జరిగిన చిన్న జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 21 రోజులపాటు మూసి ఉంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఈ నెల 21 వరకు ఆలయం తెరచుకోదని వెల్లడించారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం చిన్న జాతర గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బెల్లం, చీరసారె, పూలుపండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన జాతర ముగిసిన ఏడాది తర్వాత చిన్న జాతర జరపడం ఆనవాయితీగా వస్తున్నది.