వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..!

Vakeel Saab s Post Theatrical Streaming Rights Bagged by Amazon Prime

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న చిత్రం వకీల్ సాబ్. దిల్  రాజు, బోనీ కపూర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ తో పాటూ డిజిటల్ రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.
 
ఏప్రిల్ 9న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి ముస్తాబవుతున్న నేపథ్యంలో ఓటీటీతో పాటూ శాటిలైట్ రిలీజ్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వకీల్ సాబ్ కు సంబంధించిన వీడియో డిజిటల్  రైట్స్ ను దక్కించుకోగా, జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. సినిమా థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాత అంటే  దాదాపు మే చివరి వారంలో వకీల్ సాబ్ ను ఈ వేదికల్లో చూడొచ్చన్నమాట. అయితే డిజిటల్ రైట్స్ 15 కోట్ల వరకు డీల్ జరిగిందని, రిలీజైన తర్వాత 50 రోజులకు ప్రైమ్ లో అప్ లోడ్ కానుందని తెలుస్తుంది.  

 


                    Advertise with us !!!