
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన A1 ఎక్స్ ప్రెస్ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అసలు కోవిడ్ తర్వాత ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ పరిస్థితుల్లో కూడా సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులు చాలా గ్రేట్. మీరు ఇచ్చే ఎనర్జీ మూలంగానే మేం ఏదైనా చేయగలుగుతున్నాం అన్నారు.
రామ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామ్ కు చాలా థ్యాంక్స్. రామ్ అసలు బయటకు రాడు. ఈవెంట్ కు రామ్ ని పిలవాలనుకున్నప్పుడు కూడా రామ్ వస్తాడా రాడా అనే డౌట్ వచ్చిది కానీ ట్రై చేసి చూద్దాం అనుకుని ట్రై చేశాం. వచ్చాడు. చాలా హ్యాపీ గా ఉంది. తన సినిమాలన్నీ చూస్తుంటా. రామ్ డ్యాన్సు లు చూసిన ప్రతీ సారీ నేను చాలా ఫీలవుతుంటాను. ఏంటి అసలు మనవాడు ఆగట్లేదే అనుకుంటూంటా. రామ్ లా డ్యాన్స్ చేయడానికి ట్రై చేస్తానని రామ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు సందీప్ కిషన్.