సాయి పల్లవినే నమ్ముకున్న సెన్సిబుల్ డైరక్టర్

Love Story movies Saranga Dariya sees Sai Pallavi in actors most natural dancing element

సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ. క్లాస్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాయి పల్లవి చైతన్యలు కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల సారంగదరియా అని సాగే ఈ హుషారైన జానపద పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

అయితే హీరోయిన్ సాయి పల్లవి టాలెంట్ గురించి తెలిసిందే. ఆమె అద్భుతమైన యాక్టింగ్, డ్యాన్స్ తో మతి పోగొట్టేస్తుంది. సినిమాలోని అన్ని పాటలకు సాయి పల్లవితో ఫుల్ స్టెప్పులేయిస్తున్నాడని టాక్. ఏప్రిల్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమా విషయంలో కూడా శేఖర్ కమ్ముల.. సాయి పల్లవినే నమ్ముకున్నట్లు తెలుస్తుంది.  

సాంగ్స్, డ్యాన్స్ విషయంలో ఆమె హైలైట్ అవడం ఖాయం. సారంగదరియా సాంగ్ లో సాయి పల్లవి స్టెప్పులు ఇరగదీయడం ఖాయమని ఆల్రెడీ తేలిపోయింది. ఈ ఒక్క పాటతోనే సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమని తెలుస్తుంది.