ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?

tdp-state-president-achannaidu-fires-on-ap-government

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో గృహ నిర్బంధం చేసిన టీడీపీ నేతలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వేలాది మందితో సమావేశాలు, ర్యాలీలు సభలు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం, శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో వైకాపా మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు పర్యటన చూసి వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు.. ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని, గుండాగిరిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. వైకాపా పాలనపై ప్రజలు విసిగెత్తారు. కాబట్టే ప్రజల తరపున నిలబడుతున్న నేతలను ఇళ్లలో నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. నిర్బంధించి ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలని చూస్తున్న జగన్‌ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

 


                    Advertise with us !!!