చంద్రబాబుకు షాక్ .. పర్యటనకు అనుమతి లేదు

TDP Chief Chandrababu Naidu Detained At Renigunta Airport

చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విమానాశ్రయంలోనే నేలపై బైఠాయించి ఆయన నిరసన వ్యక్తం చేశారు. పోలీసు చర్యలతో తన సంకల్పాన్ని అడ్డుకోలేరని చంద్రబాబు సృష్టం చేశారు. తనను ఎవరూ అడ్డుకోలేరని, తమ గొంతు నొక్కలేరని ట్విటర్‌ వేదికగా ఆయన జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలను కలవనీయకుండా అడ్డుకోవడం తగదని ముఖ్యమంత్రికి హితవు పలికారు. భయపెట్టి ఎన్ని రోజుల పాలన సాగిస్తారని ప్రశ్నించారు. జగన్‌ ఇంకా రాజకీయ పరిణితి సాధించాలని విమర్శించారు.

 


                    Advertise with us !!!