చంద్రబాబు ప్లేస్ లో ఇప్పుడు జగన్ ఉంటే...?

Jagan Mohan Reddy vs Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందా...? విఫలమైందా...? అంటే కచ్చితంగా విఫలమైంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కాస్త ఉండటంతో స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాస్త ప్రభావం చూపించింది అనే మాట వాస్తవం. మరో పార్టీ ప్రత్యామ్నాయంగా కాస్త బలంగా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ ఆమాత్రం కూడా ప్రభావం చూపించ లేకపోవచ్చు. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయించే విషయంలో ఘోరంగా విఫలమవుతున్నారు.

రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న సమస్యల మీద తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఆరోపణలు కూడా చేయలేకపోతున్నది. రోడ్ల నిర్మాణం గాని రోడ్ల విస్తరణ రోడ్ల అభివృద్ధి పనులు గాని ఎక్కడా కూడా జరిగిన పరిస్థితి లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కానీ దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో విమర్శలు చేయడం గానీ నిరసనలు రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు చేయడం గాని చేయలేకపోతున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎప్పుడు లేని విధంగా ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేసే విషయంలో కూడా వెనకడుగు వేస్తున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ లేకపోతే రాష్ట్రంలో అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు చేస్తున్నారు చర్యలు వంటి వాటిని ప్రధానంగా హైలెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి కూడా క్షేత్రస్థాయి వరకు అదే జరుగుతుంది. ఇక తాజాగా గుంటూరు జిల్లాలో ఒక యువతిపై దాష్టికం జరిగింది. ప్రేమించలేదు అనే కోపంతో ఒక యువకుడు ఆమెను దారుణంగా హత్య చేసాడు. దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం గానీ తెలుగుదేశం పార్టీ కీలక నేతలు గాని ఎక్కడ నిరసన చేసిన పరిస్థితి లేదు.

కేవలం సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం లేకపోతే వైసిపి అనుకూల మీడియాలో వచ్చిన కథనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలు చేయడం మినహా ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయలేకపోయారు. వైసిపి అధికారంలో ఉండటంతో భయపడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇవే సమస్యలు భవిష్యత్తులో ఉంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అనేది కష్టమే అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని చూసి తెలుగుదేశం పార్టీ మాకు బలం పెరిగింది అనుకోవడం అమాయకత్వం. అంతేగాని రాజకీయం ఎప్పటికీ కాదు. అదే వైసీపీ ప్రతిపక్షంలో ఉంటే క్షేత్రస్థాయి ఉద్యమాలు మరోలా ఉండేవి. ముఖ్యమంత్రి జగన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేసేవారు. గతంలో జరిగిన రిషితేశ్వరి హత్యగాని అలాగే గురజాల ఘటనలో గాని మరి కొన్ని ఘటనల విషయంలో గానీ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేసింది. మరి ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచిస్తారో లేదో...?