కేసీఆర్ ఈ నష్టాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది...?

CM KCR not focus on Welfare Schemes and Unemployment Allowance

తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు ఎటువంటి సమస్యలు లేకపోయినా కొన్ని కొన్ని అంశాల్లో సీఎం కేసీఆర్ చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి 2014 తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలు అయితే తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంటుంది. కానీ ఆయన హామీలు దాదాపుగా అమలు కాలేదు అనే విషయం అందరికీ తెలుసు. అందుకే ఇటీవల జరుగుతున్న అన్ని ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర ఫలితాలు వస్తున్నాయి అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది.

భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయిలో బలపడితే తెలంగాణ లో సీఎం కేసీఆర్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ హామీలు మీద ప్రత్యేకంగా దృష్టి సారించలేదు అంటే మాత్రం క్షేత్రస్థాయిలో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉండవచ్చు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి అనేది కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేయలేకపోతోంది.

తెలంగాణలో నిరుద్యోగ భృతి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అమలు చేసి యువతను ఆకట్టుకోవడానికి అవసరం ఉన్నా సరే సీఎం కేసీఆర్ అడుగులు వేయలేకపోతున్నారు. అలాగే సొంత ఇల్లు నిర్మించుకునే వారికి రాష్ట్రంలో నిధులు రావడం లేదు. దీని వలన ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి. ఎంతసేపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మీద పెట్టిన దృష్టి సొంత ఇల్లు నిర్మించుకునే వారికి సహాయం అందించడంలో పెట్టకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ అంశాలను ప్రధానంగా టార్గెట్ చేస్తే క్షేత్రస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతుంది.

తెలంగాణలో ఆదాయం తక్కువగా ఉన్న వర్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్లందరికీ కూడా ఆర్థిక ప్రోత్సాహం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉండే వారి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. అవి కూడా పెద్దగా అమలు కాలేదు అని చెప్పాలి. ఎన్నారై పాలసీ విషయంలో కూడా పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకున్న విధంగా స్పందన లేదు. ఇక ఎంతసేపు హైదరాబాద్ అభివృద్ధి మీద పెట్టిన దృష్టి జిల్లాల మీద పెట్టకపోవడం పట్ల కూడా ప్రజలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా అలాగే మహబూబ్ నగర్ జిల్లా మినహా పెద్దగా ఏ జిల్లా కూడా ఇప్పుడు తెలంగాణలో అభివృద్ధి చెందిన పరిస్థితి కనబడటం లేదు. వరంగల్ జిల్లాలో ఒక వరంగల్ నగరం మాత్రమే అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ మీద సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించుకో లేదంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. ప్రజల ఆకాంక్షలను సీఎం అర్ధం చేసుకోలేకపోతున్నారు కూడా.