మోడీకి ఈ తప్పులు కనపడటం లేదా...?

Petrol at ?100| PM Modi blames previous governments for not cutting import dependence

భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో బలోపేతం కావడం ఏమోగానీ ఇపుడు మాత్రం కొన్ని కొన్ని సమస్యలను పార్టీ అధిష్టానం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. భారతీయ జనతా పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు గాని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానీ ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ప్రధానంగా పెట్రోల్ ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గక పోవడం అర్థం లేని వ్యాఖ్యలు చేయడం వంటివి ప్రజల ఆగ్రహానికి కారణంగా మారుతున్నాయి అనే చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రోడ్ల మీద కూర్చుని నిరసన చేసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు పెట్రోల్ ధరలను భారీగా పెంచడం పట్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉంది అనే విషయాన్ని గ్రహించడం లేదు. సామాన్యులు అసలు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నా సరే రాష్ట్రాలు కూడా ప్రజల మీద కనికరం చూపించలేని పరిస్థితి కూడా కనబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే పెట్రోల్ ధరలు వంద దాటి చాలా రోజులు అయిపోయింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.

కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ కాలాల ఆధారంగా పెట్రోల్, గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి అని చెప్పటం పై ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగిందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా అమలు చేయడం లేదు. అసలు సంక్షేమ కార్యక్రమాలు ఏవి అమలవుతున్నాయో కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎంతసేపు రాజకీయ కారణాలతో హిందుత్వ వాదాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో కూడా ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి.

ఇక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ పెద్దలను వెనకేసుకు రాలేక సతమతమవుతున్నారు. ఎంతసేపు రామాలయ నిర్మాణం లేకపోతే పాకిస్తాన్ సమస్య మినహా పెద్దగా ఏది కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయలేకపోతున్నారు. అన్ని దేశాల ప్రధానులు వ్యాక్సిన్ వేయించుకుంటే నరేంద్ర మోడీ మాత్రం వ్యాక్సిన్ వేయించుకునే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించారు. సోమవారం నాడు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

దీనిపై కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షం బలపడే ప్రయత్నం చేస్తున్న తరుణంలో దేశంలో తీవ్రంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయడం లేదు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఆర్థిక ప్రోత్సాహం అందించాల్సి ఉన్నా సరే కేవలం ఉత్తరాది రాష్ట్రాల మీద మాత్రమే దృష్టి పెట్టడం వంటివి కూడా భారతీయ జనతా పార్టీకి ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలన విషయంలో కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. జనాభా ఎక్కువ ఉండటంతో అక్కడ హిందుత్వ వాద రూపంలో భావోద్వేగాలను  మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకు వెళ్తుంది. కానీ ప్రజలకు అవసరమైన వాటిని మాత్రం ఉత్తరాది రాష్ట్రాల్లో అందించలేక పోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 

 


                    Advertise with us !!!