కేసీఆర్ ని తిడితే అధికారంలోకి వచ్చేస్తారా...?

Bandi Sanjay slams CM KCR for cheating public

ఎవరెన్ని చెప్పినా సరే తెలంగాణలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ స్వయంగా అధికారంలోకి రావడం అనేది సాధ్యం అయ్యేపని కాదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. రాజకీయంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా ఎదుర్కొని ముందుకు వెళ్లడం అనేది భారతీయ జనతా పార్టీ నేతలకు ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఎందుకు ఏంటి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. రాజకీయంగా తెలంగాణ లో వేసే అడుగుల విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేసిన తప్పులే దీనికి ప్రధాన కారణంగా కొంతమంది చెబుతూ ఉంటారు.

అలాగే పార్టీ సంస్థాగత నిర్మాణం విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం గానీ కేంద్ర నాయకత్వం గానీ పెద్దగా దృష్టి పెట్టకపోవడం తీవ్ర సమస్యగా మారింది అనేది కొంతమంది చెప్పేమాట. అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ని దగ్గరగా గమనిస్తున్న కొంతమంది నేతలు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షం అధికారంలోకి రావాలి అంటే అధికార పక్షాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. కేవలం ఆరోపణలు మాత్రమే పరిమితమైనా ఉపయోగం ఉండదు.

ఆ పార్టీ మూల సిద్ధాంతమైన హిందుత్వ వాదాన్ని పదేపదే ఎత్తుకొని విమర్శించడం ద్వారా కూడా లాభం ఉండే అవకాశాలు ఉండవు. ఇప్పటికే దేశంలో హిందుత్వ వాదాన్ని బలంగా పెంచే క్రమంలో భారతీయ జనతా పార్టీ పైకి కనబడని వ్యతిరేకతను తెచ్చుకుంది అనే భావన చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తెలంగాణలో కాస్త హిందుత్వ వాదం ఎక్కువగానే ఉండవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఉత్తరాది ప్రభావం ఎక్కువగా ఉండటం... మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సరిహద్దుల్లో ఉండటం... కర్ణాటక ప్రభావం ఉండటంతో తెలంగాణలో హిందుత్వ వాదం ఎక్కువగానే ఉంటుంది.

అందుకే మత ప్రచారం కూడా పెద్దగా జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచించుకుంటే మంచిది అనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే సంస్థాగత నిర్మాణం విషయంలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా వెనకబడి ఉంది. రాష్ట్ర నాయకత్వం బిజెపికి బలంగానే ఉంది. బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సహా కొంతమంది నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో విమర్శలు చేయడం లేదు.

నియోజకవర్గ ఇన్చార్జిలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదనే చెప్పాలి. చాలా మంది నేతలు ప్రజలకు కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీల నేతలను తీసుకుని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టిఆర్ఎస్ పార్టీ తో కేంద్రంలో స్నేహం చేసి రాష్ట్రంలో యుద్ధం చేస్తే ఎటువంటి ఉపయోగాలు కూడా ఉండవు. ఈ విషయాన్ని కూడా బీజేపీ నేతలు గ్రహిస్తే మంచిది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచింది అంటే అభ్యర్ధికి పేరు ఉండబట్టే... అలాంటి అభ్యర్ధులు రాష్ట్రం మొత్తం ఉంటే మంచిది.