శృతిమించిన శృతి హాసన్ డేటింగ్ వ్యవహారం...

shruti-haasan-poses-stunning-mirror-selfie-rumoured-boyfriend-santanu-hazarika-take-look

తండ్రి బొమ్మ స్వయంగా గీసిన ఆర్ట్ తో ఇంప్రెస్స్ చేస్తున్న కొత్త ప్రియుడు
మాజీ ప్రియుడు మైకేల్ కోర్స‌లేతో బ్రేకప్ చేసుకున్న కమల్ హాసన్ తనయ శృతి హాసన్  ఇటీవలే  క్రాక్ చిత్రంతో  రీ- ఎంట్రీ ఇచ్చిన మరోసారి తన డేటింగ్ వ్యవహారంతో వార్తల్లో నిలిచింది.  ఆమె, ఇప్పుడు తాజాగా  శంతను హజారికా‌తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది.స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులపాటు సినిమాలు కూడా పక్కన పెట్టేసి తన మాజీ ప్రియుడు, ఇంగ్లండ్ సింగర్ మైకేల్ కోర్స‌లేతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఆయన్ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు కూడా పరిచయం చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ అని అందరూ  ఫిక్సయ్యాక.. మెల్లగా అతనితో కట్ చేసుకుంది శృతి. కారణాలేంటనేవి బయటకురానప్పటికీ వారి ప్రేమ బంధానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడింది. ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చిన శృతి.. కొద్ది రోజులుగా మరో వ్యక్తితో ప్రేమాయణం నడుపుతోందని, డేటింగ్ వ్యవహారం ముదిరిందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ తన కొత్త బాయ్ ఫ్రెండ్ శంతను హజారికా‌ను తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేసింది శృతి హాసన్. ముంబైకి చెందిన ఆర్టిస్టు శంతను హజారికాతో కలిసి చెన్నైలో ఆమె చేసిన హంగామా, తండ్రి కమల్ హాసన్‌కి పరిచయం చేయడం చూస్తుంటే ఈ ఇద్దరి లవ్ ఎఫైర్ ఎక్కడిదాకా వెళ్లిందో అర్థమవుతోంది. రాజకీయ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు శంతను హజారికా ఓ అపురూపమైన గిఫ్ట్ ఇవ్వడం గమనార్హం. తమిళ రాజకీయ ప్రక్షాళనకై బయల్దేరిన కమల్..‌ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్ లైట్‌ పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తున్నట్లు తానే స్వయంగా గీసిన ఆర్ట్‌ను ప్రెజెంట్ చేశారు శృతి బాయ్ ఫ్రెండ్ శంతను. ఈ ఆర్ట్ వర్క్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆయన్ను ప్రశంసించారు కమల్.

ఇకపోతే చెన్నైలో తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి హంగామా చేసిన శృతి.. అతన్ని కౌగిలించుకొని సన్నిహితంగా దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. పైగా 'చెన్నైలో చిల్లింగ్ సీన్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో శృతి ప్రేమ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ తాజాగా అమెజాన్ ప్రైమ్ కి ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్టు ప్రకటించింది. రవి సుబ్రహ్మణ్యం రాసిన 'LOVE BETRAYAL AND REDEMPTION'  అనే  ఇంగ్లీష్ నవల ఆధారంగా ఈ సిరీస్ షూటింగ్ జరుపుకుంటుంది. శృతి హాసన్ సరసన 'సంపంగి' హీరో దీపక్ నటిస్తున్నాడు.