ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్టైనర్ సంపూర్ణేష్ బాబు హీరోగా కొత్త సినిమా..

Sampoornesh Babu to do a Hilarious Entertainer as his next movie with RK Malineni

సంపూర్ణేష్ బాబు హీరోగా ఓ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించేందుకు మ‌ధుసూధ‌న క్రియేష‌న్స్‌, రాధాకృష్ణ టాకీస్ స‌న్నాహాలు చేస్తున్నాయి. ఆర్‌.కె. మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రానికి ఆశాజ్యోతి గోగినేని నిర్మాత‌. సంపూర్ణేష్ బాబు స‌ర‌స‌న నాయిక‌గా వ‌సంతి న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌ధ‌ర్ స‌మ‌ర్ప‌కునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఒక డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌తో, ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌నుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి క‌థ‌ను కానీ, ఇలాంటి పాత్ర‌ను కానీ సంపూర్ణేష్ బాబు చేయ‌లేద‌ని ద‌ర్శ‌కుడు ఆర్‌.కె. మ‌లినేని తెలిపారు.

ఒక చ‌క్క‌ని క‌థ‌తో, సంపూర్ణేష్ బాబు హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌నీ, మార్చిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామ‌నీ నిర్మాత‌లు తెలిపారు.

తారాగ‌ణం: సంపూర్ణేష్ బాబు, వ‌సంతి, పోసాని కృష్ణ‌ముర‌ళి, వైవా హ‌ర్ష‌, గెట‌ప్ శ్రీ‌ను, రోహిణి.