
వరుసగా సినిమాల్ని ప్రకటించి ప్రభాస్ ఈ లాక్ డౌన్ లో షాక్ ఇచ్చాడు. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందే మూడు సినిమాల్ని ప్రకటించాడు. వీటిలో నాగ్ అశ్విన్, అశ్వనీదత్ కాంబినేషన్ మూవీని ఎంతో గొప్పగా లాంఛ్ కూడా చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ మూవీ దర్శకుడు తాజా ఇంటర్వూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిపారు. జూన్ జులై నుంచి షూటింగ్ ప్రారంభించనున్నామని ప్రభాస్ అభిమానులు చెవిన వేశారు. ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ అని తెలిపారు.
నెట్ ఫ్లిక్స్ లో పిట్ట కథలు లో ఎక్స్ లైఫ్ ఎపిసోడ్ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఎక్స్ లైఫ్ స్టోరీ నేపథ్యంలో ప్రభాస్ తో తన నెక్స్ సినిమాని వర్చువల్ రియాలిటీ నేపథ్యంలో అనుకున్నారు చాలా మంది. కానీ అది నిజం కాదని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కేటగిరీ మూవీ కాబట్టి సినిమా కోసం మెంటర్ నాగ్ అశ్విన్ కు సాయం చేయడానికి ప్రముఖ వెటరన్ డైరక్టర్ సింగీతం శ్రీనివాస్ ఈ టీమ్ తో చేరారు. పిట్ట కథలు ఓటీటీలో వరుస సినిమాల వెల్లువ వల్ల అంతగా ఆదరణ పొందని సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మరో క్రేజీ పాన్ ఇండియా సినిమా సలార్ వచ్చే ఏప్రిల్ 14న డేట్ ఫిక్స్ చేశారని ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.