
ఉప్పెన తో సన్సేషనల్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్..ఇప్పుడు తన రెండో సినిమాకు కూడా అలాంటి సెన్సేషనల్ టైటిల్నే లాక్ చేశాడు. రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్ హీరోహీరోయిన్లుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందని ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ సినిమాకు 'కొండపొలం' అనే టైటిల్ ను ఫైనల్ చేశారని ప్రచారం సాగింది కానీ ఇప్పుడు ''జంగిల్ బుక్'' అనే టైటిల్ ను ఈ సినిమాకు లాక్ చేశారని, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుంది. టాకీ చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా స్టోరీ తో పాటూ విజువల్ ఎఫెక్ట్స్ కూడా మెస్మరైజ్ చేస్తాయని చెప్తున్నారు. కొండపొలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ కానుంది.