పెళ్లి విషయమై క్లారిటీ ఇచ్చిన శ్రీముఖి

Anchor Srimukhi Gives Clarity on Her Marriage

తెలుగు బుల్లితెరపై సుమ తర్వాత అంతటి టైమింగ్ ఉన్న యాంకర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేర్లలో శ్రీముఖి పేరు ముందుంటుంది. తన ఎనర్జీతో అందరికీ ఆదర్శమనడంలో ఎలాంటి సందేహం లేదు. మంచి ఫిజిక్ తో పాటూ ఆకట్టుకునే రూపం ఉండటంతో యాంకర్ గానే కాకుండా వెండితెరపై కూడా శ్రీముఖికి ఆఫర్లొస్తున్నాయి. అయితే ఇటీవలే పెళ్లి విషయమై ఒక టాక్ షో లో క్లారిటీ ఇచ్చేసింది. తన మాటల ప్రకారం ఇప్పట్లో తను పెళ్లి చేసుకోదని తేలిపోయింది. ప్రస్తుతం రిలేషన్ లో లేను అని కూడా క్లారిటీ ఇచ్చేసింది.

కెరీర్ పరంగా తాను చాలా సంతోషంగా ఉన్నాను. మరో మూడు నాలుగేళ్ల వరకు ఈ విషయం గురించి ఆలోచించాలనుకోవట్లేది క్లారిటీ ఇచ్చింది. 31 యేళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పిన శ్రీముఖి తనకు కాబోయే వాడు యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండాలని.. అలాగే తనను ఎక్కువగా గారాబం చేయడంతో పాటు తనకు స్వేచ్ఛను ఇవ్వాలంటూ తన కాబోయే వాడికి ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది.  

 


                    Advertise with us !!!