సర్కారు వారి పాట తర్వాత మహేష్ సినిమా అనిల్ తోనే...!

Anil Ravipudi planning a movie with Mahesh

సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు గతేడాది సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట తో బిజీగా ఉన్న మహేష్.. ఈ సినిమా తర్వాత మరోసారి అనిల్ డైరక్షన్ లో సినిమా చేసేందుకు తలూపాడట. నిజానికి సర్కారు వారి పాట తర్వాత మహేష్.. రాజమౌళితో సినిమా చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తర్వాతి సినిమా మహేష్ తోనే. దానికి చాలా టైమ్ పట్టేట్లుంది కాబట్టి ఈ లోపు ఒక సినిమా చేద్దామన్న యోచనలో ఉన్నాడట టాలీవుడ్ ప్రిన్స్.

ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. అంటే ఇంకా 8 నెలల టైమ్ ఉంది. ఆ తర్వాత మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టి, సినిమా పట్టాలెక్కడానికి చాలానే టైమ్ పడుతుంది.  మరోవైపు సర్కారు వారి పాట వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ కు పూర్తి కానుంది. అంటే సెప్టెంబర్ నుంచి మహేష్ ఖాళీ గానే ఉండే ఛాన్సుంది. అందుకే రాజమౌళితో సినిమా మొదలయ్యే లోపు ఇంకో సినిమా చేయాలనుకున్నాడట మహేష్.  

ఈ నేపథ్యంలోనే పలు దర్శకులు మహేష్ ను కలిసి కథలు వినిపించగా వారిలో ఛాన్స్ మాత్రం అనిల్ ను వరిస్తుందని సమాచారం. దాదాపు అనిల్ కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, సర్కారు వారి పాట షూటింగ్ అయిపోగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. 

 


                    Advertise with us !!!