2022 సంక్రాంతి మహేష్ వర్సెస్ పవన్..!

Mahesh Babu s Sarkaru Vaari Paata and Pawan Kalyan s PSPK 27 to compete on Sankranti 2022

2022 సంక్రాంతి సీజన్ టాలీవుడ్ లో మునుపెన్నడూ ఏ సంక్రాంతికి లేనంత గ్రాండ్ గా థియేటర్లను వేడిక్కించనుంది. రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచనాలకు తెర తీయనున్నాయి. ఈ రెండిట్లో ఇద్దరు క్రేజీ అగ్ర హీరోలు నటించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకి ఆ ఇద్దరు ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ ఈ ఇద్దరి పోటీ షురూ అయింది.

మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు కానీ మొదటి షెడ్యూల్ ఇటీవల దుబాయ్ లో పూర్తయింది. తదుపరి షెడ్యూల్స్ పైన పరశురామ్ వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సీజన్ లో ఈ చిత్రం తెరపైకి వస్తుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రేసు లో చేరారు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా 2022 సంక్రాంతి బరిలోనే థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు.

ప్లాన్ ప్రకారం ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోరు తప్పదనే అర్థమవుతుంది. అందరూ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న వారే కావడంతో ఈ పోటీని అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారనడంలో సందేహం లేదు.  

 


                    Advertise with us !!!