బాబాయ్ కోసం అబ్బాయి త్యాగం..

Venkatesh takes Rana s place due to this reason

నారప్ప రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో చిత్ర యూనిట్ కొంచెం తొందరపడి మే 14న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆచార్య ఆల్రెడీ మే రెండో వారంలో రిలీజ్ ఉందని ఫిక్స్ అయిందని తెలుసో తెలీదో కానీ ఆచార్య కూడా మే 13న రానున్నట్లు ప్రకటించింది.

ఒకప్పుడు చిరూ, వెంకీ మధ్య బాక్సాఫీస్ పోరు  బాగా నడిచేది. కానీ ఇప్పుడు వెంకీ రేంజ్ తగ్గింది. భారీ అంచనాలున్న ఆచార్య సినిమాకు పోటీగా నారప్ప ను నిలిపే సిట్యుయేషన్ లో ప్రస్తుతం వెంకీ లేడు. దీంతో నారప్ప రిలీజ్ డేట్ మార్చుకోక తప్పని పరిస్థితి. ముందు, వెనుక డేట్లన్నీఇప్పటికే ప్యాక్ అయిపోయాయి. డేట్ మార్చుకుందామంటే ఎక్కడా ఖాళీ కనిపించట్లేదు. అలా అని ఆచార్య కు పోటీ గా వెళ్దామన్నా కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆలస్యమైన తరుణంలో నారప్ప ను త్వరగా రిలీజ్ చేయడం కోసం రానా త్యాగం చేయనున్నట్లు సమాచారం.

రానా కొత్త చిత్రం విరాట పర్వం ఏప్రిల్ 30కి ఫిక్స్ అయిన నేపథ్యంలో నారప్ప రాబోతున్నట్లు తాజా సమాచారం. విరాటపర్వం పని ఇంకా మిగిలుంది. కొంచెం ఆలస్యమైనా ఫర్వాలేదు. పైగా రానా ఇంకో సినిమా అరణ్య మార్చి 26న రాబోతుంది. అది వచ్చిన నెలకే తన మరో సినిమా రిలీజ్ చేయడం ఎందుకులే అని రానా ఆలోచిస్తున్నాడట. తన సినిమాను జూన్ లో కుదిరిన డేట్ కు రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యాడట. అందుకే ఈ మధ్య విరాట పర్వం పోస్టర్స్ మీద రిలీజ్ డేట్ వేయట్లేదట. నారప్ప, విరాటపర్వం చిత్రాలు రెండింట్లోనూ రానా తండ్రి సురేష్ బాబే నిర్మాత కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది లేకపోయింది. మరి కొత్త రిలీజ్ డేట్ల మీద ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.