నాని కాదన్న కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్!

Nani s Rejected Story Goes To Vaishnav Tej..

ఒక హీరో వద్దన్నా కథలు వేరే హీరో ఒప్పుకుని చేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్లు పొందాయి. తాజాగా నాని రిజెక్ట్ చేసిన ఓ కథ వైష్ణవ్ తేజ్ ని ఇంప్రెస్ చేసిందట. 'ఉప్పెన' విజయంతో తెలుగు దర్శకనిర్మాతల చూపు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్‌పై పడింది. దీంతో ఆయనకు వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. మంచి మంచి కథలు రెడీ చేసి వైష్ణవ్ తేజ్ ని ఇంప్రెస్ చేయడానికి టాలీవుడ్ దర్శకులు ప్రయత్నిస్తున్నారు.  మెగా కాంపౌండ్ హీరోగా 'ఉప్పెన' సినిమాతో తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. కెమెరా ముందు ఈ హీరో చూపిన హావభావాలు, నటన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఆయనకు ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయట. పలువురు దర్శకనిర్మాతలు వైష్ణవ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారట.

ఈ నేపథ్యంలోనే హీరో నాని రిజెక్ట్ చేసిన ఓ కథను వైష్ణవ్ ఓకే చేశారని తెలుస్తోంది. ఇటీవల నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేశాడు. అది హీరో నాని చేస్తే బాగుంటుందని భావించిన ఆయన నానికి కథ చెప్పగా.. నాని రిజెక్ట్ చేశారట. దీంతో అదే కథను మెగా కాంపౌండ్ కొత్త హీరో వైష్ణవ్ తేజ్‌కు వినిపించడంతో ఆ స్టోరీ నచ్చి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ఫిలిం నగర్ టాక్. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు.ఇకపోతే దర్శకుడు క్రిష్‌తో ఓ సినిమా చేస్తున్న వైష్ణవ్ తేజ్.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై మరో సినిమా, భోగవల్లి ప్రసాద్ బ్యానర్‌పై ఇంకో సినిమా చేయబోతున్నారట. మొత్తానికి ‘ఉప్పెన’ సక్సెస్‌తో వైష్ణవ్ జోష్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందించిన 'ఉప్పెన' మూవీ ఆశించిన దానికి మించి ఫలితం రాబట్టడంతో హీరో హీరోయిన్లు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి, డైరెక్టర్ బుచ్చిబాబుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట నిర్మాతలు.