అరోతరగతి చదువుతున్న అల్పనకు.. ఉపరాష్ట్రపతి అభినందనలు

vice-president-venkaiah-naidu-applauds-sangareddy-student-alpana

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. అందమైన చేతిరాతతో ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అల్పన రాసిన సందేశం ఉపరాష్ట్రపతికి చేరింది. స్పందించిన ఆయన చక్కని చేవ్రాలుతో మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయని, సద్గుణాలు, మానవత్వం గురించి అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసిందని, చిన్న వయస్సులోనే ఇంత చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి అభినందలనలు అని ట్వీట్‌ చేశారు. దీంతో చిన్నారికి చక్కటి చేతి రాతను నేర్పించిన పైసా సత్వంతో పాటు చిన్నారి అల్పనను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.