మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా

US FDA recommends authorising single shot Covid Vaccine from Johnson and Johnson

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ రూపొందించిన సింగిల్‌ డోసు కోవిడ్‌ -19 టీకాకు అమెరికా కమిటీ ఎమర్జెన్సీ ఆమోదం తెలిపింది. సమావేశమైన ప్యానల్‌.. జాన్సన్‌ కంపెనీ టీకాకు ఓకే చెప్పింది. అనేక పేద దేశాలకు ఇంకా టీకా అందని నేపథ్యంలో ఈ అనుమతి ఇస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. ఫైజర్‌, మోడెర్నా డోసుల తర్వాత.. మూడవ అనుమతి దక్కిన కంపెనీగా జాన్సన్‌ నిలవనున్నది. జే అండ్‌ జే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వల్ల అమెరికాలో ఇప్పటికే 5,10,000 మంది మరణించారు. సింగిల్‌ డోసులోనే తమ వ్యాక్సిన్‌ పనిచేస్తుందని, సాధారణ ఫ్రిడ్జ్‌లో సుదీర్ఘకాలం పాటు టీకాలను నిల్వ చేయవచ్చు అని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ పేర్కొన్నది.