ముచ్చటగా మూడోసారి ఆ జంట

Vijay Devarakonda and Rashmika to pair up again

విజయ్ దేవరకొండ, రష్మిక వీరి కాంబినేషన్ కు తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో తెలియనిది కాదు. గీత గోవిందంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకోవడంతో విజయ్, రష్మిక లు ఇద్దరూ స్టార్ లు ఎదిగారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ వీరి పెయిర్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. వీరి పెయిర్ కి ఉన్న డిమాండ్ అలాంటిది. దీంతో మరోసారి ఈ జోడీని తెరపై చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది.

ప్రస్తుతం విజయ్ తన సినిమాలతో బిజీగా ఉంటే.. రష్మిక భారీ విజయాలతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో పుష్ప లో నటిస్తున్న రష్మిక.. అడవి ప్రాంతానికి చెందిన గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ తో కలిసి నటించే ఛాన్సుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.  

అయితే సుకుమార్, విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో ఒక సినిమా రానుందనే విషయం తెలిసిందే. ఆల్రెడీ విజయ్ కు సుకుమార్ స్టోరీ లైన్ వినిపించడం, విజయ్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక ను ఫిక్స్ చేయనున్నట్లు చెప్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.  

 


                    Advertise with us !!!