ఆసియా అగ్రగామి కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ

Mukesh Ambani overtakes China s Zhong Shanshan to become Richest Asian

ఆసియా కుబేరుల్లో అగ్రస్థానాన్ని మళ్లీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ సొంతం చేసుకున్నారు. ఆయన సంపద విలువ 8000 కోట్ల డాలర్లని బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ తెలిపింది. ఆసియా అగ్రగామి కుబేరుల జాబితాలో గత రెండేళ్లలో ఎక్కువకాలం పాటు ముకేశ్‌ ఉన్నారు. అంతకు ముందు అగ్రస్థానంలో కొనసాగిన అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ అధిపతి జాక్‌మా నుంచి మొదటిస్థానాన్ని ముకేశ్‌ దక్కించుకున్నారు. గత డిసెంబరులో చైనాకు చెందిన నాంగ్‌పూ స్ప్రింగ్‌ కంపెనీ అధిపతి షాన్‌షాన్‌ ఆసియా అపర కుబేరుడిగా అవతరించారు. అప్పట్లో ఆయన కంపెనీ షేర్ల విలువ మూడింతలైంది. ఆయన సారథ్యంలోని వ్యాక్సిన్‌ తయారీ సంస్థ బీజింగ్‌ వాంటాయ్‌ బయోలాజికల్‌ ఫార్మాసీ ఎంటర్‌ప్రైజ్‌ షేరు 3,757 శాతం పెరగడంతో ఆయన సంపద విలువ ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఫలితంగా అగ్రస్థానం లభించింది.

ఈ వారంలో జోంగ్‌ కంపెనీ షేరు విలువ 20 శాతం కోల్పోవడంతో, సంపద మొత్తం కూడా గరిష్ఠాల నుంచి 2,200 కోటల్ల డాలర్లు తగ్గి 7,660 కోట్ల డాలర్లకు చేరింది. ఫలితంగా రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇంధనం నుంచి టెక్‌, ఇ-కామర్స్‌ సామ్రాజ్యంపై దృష్టి నిలిపిన ముకేశ్‌, గత ఏడాది గూగుల్‌, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలకు తమ రిటైర్‌ వెంచర్స్‌లో 2,700 కోట్ల డాలర్ల విలువైన వాటాలు విక్రయించడంతో ఆయన సంపద 1,800 డాలర్ల మేర పెరిగి 8,000 కోట్ల డాలర్లకు చేరింది.

 


                    Advertise with us !!!