కాళేశ్వరంలో వైభవంగా తిరుమల శ్రీవారికి చక్రస్నానం

srivari-chakrasnanam-today-in-kaleshwaram

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలో తిరుమల శ్రీవారికి చక్రస్నానం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా శ్రీవారికి పుణ్యస్నాన కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. గోదావరి తీరంలో శ్రీవారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక జలాభిషేకం చేశారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం, అనంతరం చక్రస్నానం నిర్వహించారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, అంతర్లీనంగా సరస్వతీ నదులు ప్రవహిస్తున్నాయి. ఈ మూడు నదుల సంగమ స్థానమైన కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామి వారి ఆలయం వద్ద ఈ కార్యక్రమం కన్నుల పండువగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 


                    Advertise with us !!!