విమాన ప్రయాణికులకు ఓ శుభవార్త...

No Check  In Baggage Get Discount on Air Ticket Fares for Domestic Flights

విమాన ప్రయాణికులకు ఓ శుభవార్త. ఇక నుంచి లగేజీ లేకుండా ప్రయాణం చేయదలిస్తే టికెట్‌ ధరలో రాయితీ కల్పిస్తారు. ఇప్పటిదాకా దేశీయ విమానాల్లో 15 కిలోల దాకా చెక్‌-ఇన్‌ లగేజీని, ఏడు కిలోల దాకా కేబిన్‌ లగేజీని అనుమతిస్తూ కొంత ఛార్జి వసూలు చేస్తున్నారు. అంతకుమించితే అదనపు ఛార్జీలు వేస్తున్నారు. ఇక మీదట కేవలం కేబిన్‌ లగేజీకి మాత్రమే పరిమితమైతే టికెట్‌ ధర తగ్గుతుందని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. టికెట్‌ను బుక్‌ చేసుకునేటప్పుడే లగేజీ ఎంత అన్నది ధ్రువీకరించాలి. ఈ రాయితీ ఆఫర్‌ను వినియోగించుకోదలిస్తే ఆ ప్రకారం ఫామ్‌లో ప్రస్తావించాలి అని పేర్కొంది.