37 రోజుల్లో 5 కోట్ల మందికి టీకా

us-achieves-important-milestone-of-administering-50-million-covid-19-vaccine-shots

కరోనాతో అల్లాడుతున్న అమెరికాలో ఇప్పటివరకు 5 కోట్ల మందికి కరోనా టీకా వేశారు. మహమ్మారి అంతం దిశగా ఇదీ కీలక మైలురాయి అని, అయితే ఏమాత్రం అలసత్వం తగదని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రజలకు సూచించారు. ఎంత ఎక్కువ మంది టీకా వేస్తే, అంత త్వరగా కరోనాకు ముగింపు పలుకవచ్చన్నారు. అందుకే తాను అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. తాను బాధ్యతలు చేపట్టిన 37 రోజుల్లోనే వ్యాక్సినేషన్‌లో 5 కోట్ల మార్క్‌ను చేరుకున్నామన్నారు.