కాలిఫోర్నియాలో భారీ అగ్నిప్రమాదం

Compton fire roars through industrial area, burning buses

అమెరికా కాలిఫోర్నియాలోని ఓ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న చెక్క పెట్టెల తయారీ పరిశ్రమలో మంటలు ఆకస్మాత్తుగా చెలరేగాయి. దీంతో ఆ పరిశ్రమతో పాటు పక్కనున్న కంపెనీలకు మంటలు వేగంగా వ్యాప్తించాయి. ఈ ప్రమాద ఘటనలో 10 బస్సులతో పాటు పరుపుల తయారీ పరిశ్రమ పూర్తిగా కాలిపోయాయి. 10 బస్సుల్లో కొన్ని పాఠశాల బస్సులు కూడా ఉన్నాయి. పలు ట్రాన్ష్‌ఫార్మర్లు, కరెంట్‌ స్తంభాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేసింది. మంటలు ఆర్పుతున్న క్రమంలో ఓ ఫైర్‌ ఫైటర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే అక్కడున్న ఇండ్లకు కానీ, అపార్ట్‌మెంట్స్‌కు ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలోనే సమీప దుకాణ సముదాయాలను మూసేసి, కార్మికులను ఖాళీ చేయించారు.

https://www.youtube.com/watch?v=_oP9bQxl3to