కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా?

covid-19-vaccination-phase-2-to-begin-on-1-march-cost-of-vaccine-at-private-hospitals-to-be-decided-soon

దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కూడా జరుగుతున్నది. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం నుంచి పలు సూచనలు, మార్గదర్శకాలు రావడంతో అధికారులు కసరత్తులు ప్రారంభించారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా సప్లై చేసే కొవిడ్‌ వ్యాక్సిన్‌ ధర తెలంగాణలో రూ.300 నుంచి రూ.500 మధ్య ఉండే అవకాశం ఉందని రాష్ట్ర ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా మార్చి 1 నుండి రాష్ట్రంలోని 236 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. అయితే మార్చి 1వ తేదీ నుంచి 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, 45 ఏండ్ల నుండి అనారోగ్య కారణాలు కలిగిన వారికి రెండో దశలో టీకా అందిస్తామని రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ అందజేయనున్నారు.