ప్రగ్యాపై పెద్ద భారమే ఉంది..

Pragya Jaiswal to play IAS officer in NBK Boyapati Film

బాలయ్య, బోయపాటి ల కాంబోలో తెరకెక్కుతున్న మూడో సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కూడా పూర్తి కానుంది. సినిమాలో హీరోయిన్ ఎవరరు అనుకుంటున్న టైమ్ లో ప్రగ్యా జైస్వాల్ ను మెయిన్ లీడ్ గా తీసుకున్నారు.

అయితే సినిమాలో ప్రగ్యా ఐఏఎస్ గా కనిపించబోతుందట. ఒక పిల్లాడికి తల్లిగా, పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ గా సినిమాలో మంచి పాత్ర దక్కిందట ప్రగ్యాకు. సినిమాకు మెయిన్ అట్రాక్షన్ గా కూడా ఈ క్యారెక్టర్ నిలవనుందని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. సింహా సినిమాలో నయనతార క్యారెక్టర్ రేంజ్ లో ఈ సినిమాలో ప్రగ్యా క్యారెక్టర్ ఉండనుందట. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అవడంతో పాటు కథలో కీలకపాత్ర అవడం వల్ల ప్రగ్యా పై వెయిట్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ షో లకే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్రలే చేసిన ప్రగ్యా ఈ సినిమాలో అందంతో పాటు అభినయంతో మెప్పించేందుకు ప్రయత్నం చేయనుంది. ప్రగ్యా ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది.  

 


                    Advertise with us !!!