పెళ్లి పీటలెక్కబోతున్న లేడీ సూపర్ స్టార్..

Nayanthara Vignesh Shivan Marriage Date Fix

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి వార్తలు ఎప్పటికప్పుడు సెన్సేషన్ గానే మారుతుంది. ఇదిగో రేపో మాపో పెళ్లి అంటూ హడావుడి చేయడం, తర్వాత సైలెంట్ అవడం కామన్ అయిపోయింది. తాజాగా ఇప్పుడు మరోసారి నయనతార పెళ్లి వార్త తెరపైకి వచ్చింది.

చాలా కాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయన్ దాదాపు ఐదేళ్లుగా వీరు లివ్ ఇన్ లో ఉంటున్నారు. గతంలో కూడా వీరి పెళ్లి గురించి చాలాసార్లు వార్తలొచ్చాయి కానీ అవేవీ నిజం కాలేదు. కానీ లేటెస్ట్ అప్డేడ్ ప్రకారం వీరద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరిద్దరూ ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకోబుతన్నట్లు కోలీవుడ్ మీడియా చెప్పినప్పటికీ అది జరగలేదు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చిలో వీరిద్దరూ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. క్రైస్తవ హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇప్పుడైనా వీరి పెళ్లి గురించి వచ్చిన వార్త నిజమౌతుందో లేక మళ్లీ వార్తగానే మిగిలిపోతుందో చూడాలి.