కింగ్ నాగార్జున సొంత బ్యానర్ లో వైష్ణవ్ తేజ్?

Nagarjuna to produce film with Vaishnav Tej

అన్నను మించిన తమ్ముడు 
1979 లో మురళి మోహన్ నటించిన 'కళ్యాణి' చిత్రంతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ స్టార్ట్ అయ్యింది ఆ తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో అక్కినేని ఫామిలీ హీరోలతో నే  సినిమాలు చాలా వున్నాయి అయితే ఈ బ్యానర్ లో బయటి హీరోల సినిమాలు చాలా తక్కువ. ఇటీవల ఈ బ్యానర్ లో టి వి సీరియల్ లో నటులను  పక్కన పెడితే సినిమాలలో ఇప్పటి వరకు బయటి హీరోలు  లేరు అయితే ఇన్నాళ్లకు ఓ హీరో ఈ బ్యానర్ లో నటిస్తున్నాడని తెలుస్తోంది. తొలిసినిమా 'ఉప్పెన'తోనే సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ తేజ్‌కి తన అన్న సాయి ధరమ్ తేజ్ ని మించిన  భారీ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. నాగార్జున నిర్మాణంలో రూపొందనున్న ఓ సినిమా కోసం వైష్ణవ్ తేజ్‌ని ఫైనల్ చేశారట. కుటుంబ అండదండలు ఎన్ని ఉన్నా టాలెంట్ లేనిదే సక్సెస్ అనేది అంత ఈజీగా దరిచేరదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ అందులో సక్సెస్ అనుకుంటోంది కొందరే. నటీనటులు కనబర్చే ప్రతిభ, సినిమా కంటెంట్‌లో ఉన్న సత్తానే వారి వారి కెరీర్‌కి బూస్టింగ్ అవుతుంది. అలానే సినీ వారసుడిగా తెరంగేట్రం చేసిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో తెలుగు దర్శకనిర్మాతల చూపు ఈ యువ హీరోపై పడింది.

ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునతో సినిమా చేసే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన వైష్ణవ్ తేజ్.. కెమెరా ముందు అద్భుతమైన నటన కనబర్చి పులువురు సినీ ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు. నాచురల్ లుక్, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో 'ఉప్పెన' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేసేందుకు నాగార్జున ముందుకొచ్చారట. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్న నాగార్జున.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు వేగవంతం చేశారని తెలుస్తోంది.అక్కినేని నాగార్జున నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బానర్‌పై ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్‌కు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. మొదటి సినిమా 'ఉప్పెన'కు 50 లక్షల పారితోషికం తీసుకున్న వైష్ణవ్‌కి ఏకంగా మూడు కోట్ల రుపాయల భారీ ఆఫర్ ఇచ్చారట నాగార్జున. ఈ మేరకు డిఫరెంట్ కథను ఎంచుకున్న నాగ్.. ఈ సినిమాను కొత్త ఓ దర్శకుడితో రూపొందించబోతున్నారని సమాచారం.