శ్రీ రెడ్డి చిత్రం 'క్లైమాక్స్' కి U/A సర్టిఫికెట్, మార్చి 5న రిలీజ్

Climax movie release on March 5

సంచలన తారగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న శ్రీ రెడ్డి వెండితెరపై తన ప్రతాపం చూపించే సమయం వచ్చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలపై లైంగిక ఆరోపణలతో విరుచుకుపడుతున్న ఆమె 'క్లైమాక్స్' అనే మూవీ పూర్తి చేసింది. ఇందులో తన లైఫ్‌కు దగ్గరగా ఉండే క్యారెక్టర్‌లో నటించిందట శ్రీ రెడ్డి. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫినిష్ అయిన నేపథ్యంలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. `డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఈ 'క్లైమాక్స్' చిత్రాన్ని మార్చి 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు పేర్కొన్నారు దర్శకనిర్మాతలుకైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా విభిన్న కథతో విచిత్ర పాత్రలు, కథనాలతో భవాని శంకర్. కె. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  "క్లైమాక్స్". సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ తో మార్చి 5న విడుదల కానుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడమే కాక అందులో మోడీ డౌన్ డౌన్ అనే నినాదాలపై వివాదం కాగా తాజాగా వచ్చిన సెన్సార్ సెర్టిఫికెట్ వాటన్నిటికి సమాధానం చెబుతుంది అంటున్నారు చిత్ర యూనిట్. రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఈ చిత్రంలో కరుణాకర్ రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన ఈ చిత్రంలో సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృద్వి, శివ శంకర మాస్టర్, రమేష్ లు నటించారు.ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ " ట్రైలర్ లోని విభిన్న కథనాలు ఇప్పటికే చిత్రం పై అంచనాలని అమాంతం పెంచేసాయి. మార్చి 5న థియేటర్లలో విడుదలయ్యే మా క్లైమాక్స్ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ కచ్చితంగా అందర్నీ థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుందని మాకు నమ్మకముంది" అన్నారు. చిత్ర దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ "నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని కథనాలతో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా విచిత్ర కాన్సెప్ట్ తో "క్లైమాక్స్" సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. క్లైమాక్స్, మర్డర్ మిస్టరీతో పాటు ట్విస్ట్స్ మరియు బ్యాక్ డ్రాప్ కామెడీ, ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని కథనాలు ఉంటాయి.  మునుపెన్నడూ చూడని థ్రిల్లింగ్ క్లైమాక్స్ ని చూపించడానికి మా క్లైమాక్స్ తో  మీ ముందుకు వచేస్తున్నాం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాం" అన్నారు.

 


                    Advertise with us !!!